హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ) అన్యాయం జరుగుతోందని ఈబీసీ సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఓసీ వర్గాల్లోనూ ఎంతోమంది పేదలు సొంత ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతోపాటు అగ్రవర్ణ పేదలకూ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఈబీసీలకు న్యాయం చేయాలని కోరారు.
